దుబాయ్‌లో మహేష్ స్పెషల్ ప్లాన్ ?

Published on Jan 22, 2021 1:08 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ఎట్టకేలకు కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. మొదటి నుండి అనుకున్నట్టే సినిమా మొదటి షెడ్యూల్ విదేశాల్లోనే ఉండనుంది. ఈ షూటింగ్ కోసం మహేష్ బాబు దుబాయ్ వెళ్లారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడ దుబాయ్ వెళ్లారు. రేపు మహేష్ సతీమణి నమ్రత పుట్టినరోజు. ఆ పుట్టినరోజును కుటుంబంతో కలిసి మహేష్ దుబాయ్‌లోనే ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోనున్నారు.

వేడుకల తర్వాత నమ్రత, పిల్లలు ఇండియా తిరిగి వచ్చేస్తారు. మహేష్ అక్కడే ఉండి ‘సర్కారు వారి పాట’ షూటింగ్లో పాల్గొంటారు. ఆ షెడ్యూల్ పూర్తయ్యాకే ఆయన ఇండియా తిరిగొస్తారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ దుబాయ్‌లోని ఒక బ్యాంకు నందు జరగనుంది. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ కథానాయకిగా నటించనుంది. ఈ సినిమా కోసం మహేష్ ఎప్పుడూ లేని విధంగా కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేశారు. కసరత్తులు చేసి ఇంతకుముందు కంటే మరింత ఫిట్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లతో కలిసి మహేష్ బాబు స్యయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :