సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రాగా ఈ చిత్రం అనుకున్న అంచనాలు అందుకోలేదు కానీ ఆడియెన్స్ పరంగా మాత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది.
ముఖ్యంగా ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే ఊహించని సెన్సేషన్ ని సెట్ చేసింది అని చెప్పాలి. మరి ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే యూట్యూబ్ లో ఈ 2024 ఏడాదిలో గ్లోబల్ వైడ్ గా టాప్ లో వచ్చిన సాంగ్స్ లిస్ట్ లో నిలిచింది. అనేక దేశాల్లో టాప్ సాంగ్స్ తో పాటుగా మన దేశం నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ ఒకటే నిలిచి సెన్సేషనల్ రికార్డు వ్యూస్ అందుకుంది. ఇలా మొత్తానికి ఈ సాంగ్ మాత్రం ఊహించని సంచలనం సెట్ చేసింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా హారికా హాసిని వారు నిర్మాణం వహించారు.
the world’s soundtrack for 2024? it’s right here! explore this year’s top songs on #YouTubeMusic pic.twitter.com/3fdP2DnL1C
— YouTube Music (@youtubemusic) December 27, 2024