ముహూర్త కార్యక్రమాలతో మొదలైన మహేష్, రాజమౌళి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్

ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ చిత్రం అనే చెప్పాలి. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో మొదటి సినిమాగా ఇది తెరకెక్కుతుంది.

అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ నేడు సైలెంట్ గా ముహూర్త కార్యక్రమాలు చేసేసారు. హైదరాబాద్ లోనే అల్యుమియం ఫ్యాక్టరీలో చిత్రం ప్రధాన బృందం మాత్రమే ఈ ముహూర్త కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అయితే ఎలాంటి ఫోటో లేదా వీడియో ఫుటేజ్ ని చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చెయ్యలేదు. కానీ సినిమా అయితే నేడే ఆరంభం అయ్యింది. మరి అధికారికంగా అనౌన్సమెంట్ కోసం అభిమానులు ఇపుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తూ అదరగొడుతున్నారు.

Exit mobile version