‘ముఫాసా’ కోసం మహేష్ వాయిస్ ఓవర్

‘ముఫాసా’ కోసం మహేష్ వాయిస్ ఓవర్

Published on Aug 21, 2024 12:07 PM IST

ప్రముఖ హాలీవుడ్ సంస్థ వాల్ట్ డిస్నీ స్టూడియోస్ నుంచి వస్తున్న ‘లయన్ కింగ్’ ఫ్రాంచైజీ కొత్త మూవీ ‘ముఫాసా – ది లయన్ కింగ్’ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఇండియాలోనూ మంచి క్రేజ్ నెలకొంది. దీంతో ఈ ‘ముఫాసా’ చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఇప్పటికే బాలీవుడ్‌లో ఈ సినిమాలోని ముఫాసా పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తన వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ అక్కడి ఆడియెన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగులో ‘ముఫాసా’ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారు. మహేష్ లాంటి స్టార్ యాక్టర్ వాయిస్ ఓవర్ ఇస్తుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లోనూ అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఇక ‘ముఫాసా’ తెలుగు ట్రైలర్‌ను ఆగస్టు 26న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని డిసెంబర్ 20న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు