మహేష్ చేతుల మీదుగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్

మహేష్ చేతుల మీదుగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్

Published on Jan 6, 2025 6:02 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిజామాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు మేకర్స్.

ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను డిజిటల్‌గా రాత్రి 8.01 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించారు చిత్ర యూనిట్. అయితే, ఈ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. దీంతో వెంకటేష్ కోసం మహేష్ బాబు ట్రైలర్ లాంచ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పెద్దోడి కోసం చిన్నోడు వస్తున్నాడు.. అంటూ అభిమానులు నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు