“గుంటూరు కారం” నుంచి మహేష్ అన్ సీన్ పిక్ వైరల్.!

“గుంటూరు కారం” నుంచి మహేష్ అన్ సీన్ పిక్ వైరల్.!

Published on Sep 8, 2024 9:00 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మహేష్ చేసిన హ్యాట్రిక్ సినిమా ఇది కాగా భారీ అంచనాలు నడుమ ఈ చిత్రం రిలీజ్ కి వచ్చింది. అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఇన్ని నెలలు అయ్యినప్పటికీ ఏదొక సందర్భంలో ఇప్పటికీ సోషల్ మీడియాలో గుంటూరు కారం ప్రస్తావన వస్తుంది.

మరి రీసెంట్ గానే సినిమా చార్ట్ బస్టర్ సాంగ్ కుర్చీ మడత (Kurchi Madatha Petti) పెట్టి 400 మిలియన్ కి పైగా వ్యూస్ ని క్రాస్ చేయగా ఇప్పుడు మరోసారి గుంటూరు కారం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నడుమ వైరల్ గా మారింది. మరి ఈ సినిమా నుంచి మహేష్ పై ఒక బ్యూటిఫుల్ అన్ సీన్ పిక్ ఒకటి వైరల్ గా మారింది.

సినిమాలో జగపతి బాబు ఇది దగ్గర నడిచే యాక్షన్ సీన్ షూట్ నుంచి మహేష్ స్టిల్ కనిపిస్తుండగా సూపర్ స్టార్ ఇందులో కళ్లద్దాలు పెట్టుకొని హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తున్నారు. దీనితో ఈ అన్ సీన్ పిక్ చూసి అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రస్తుతం మహేష్ బాబు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితో సెన్సేషనల్ ప్రాజెక్ట్ తన కెరీర్ 29వ సినిమా (SSMB 29) చేయనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు