కుమారుడికి మహేష్ బర్త్ డే విషెస్.. గర్వంగా ఉందంటూ ట్వీట్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 29వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేయనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇంకా షూటింగ్ కూడా మొదలు పెట్టని ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు.

అయితే, నేడు మహేష్ బాబు కుమారుడు గౌతమ్ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా అతడికి బర్త్‌డే విషెస్ తెలిపాడు. గౌతమ్ 18వ ఈడులోకి అడుగుపెట్టడం తనకు సంతోషంగా ఉందని.. తన స్పెషల్ డేను ఎంజాయ్ చేస్తూ, ఎక్స్‌ప్లోర్ చేస్తూ మరింత స్పెషల్‌గా మార్చుకోవాలని మహేష్ కోరాడు. తనని చూస్తే తండ్రిగా గర్వంగా ఉందని మహేష్ ట్వీట్ చేశాడు.

ఇక మహేష్ తన కుమారుడి బర్త్‌డే పై చేసిన ట్వీట్‌ను అభిమానులు నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. కాగా మహేష్ ప్రస్తుతం సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటం ఆయన అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

Exit mobile version