టాలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం మూవీ చేస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈమూవీని త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ వారు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు కలిగిన గుంటూరు కారం 2024 జనవరి 13న విడుదల కానుంది.
ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరొక సరికొత్త బ్రాండ్ ని ఎండార్స్ చేస్తున్నారు. టెక్నో పైయింట్స్ వారి యాడ్ లో నటిస్తున్నారు మహేష్. ఇక ఈ యాడ్ సందర్భంగా మహేష్ డిఫరెంట్ గా కర్లి హెయిర్ స్టైల్ తో కనిపించారు. కాగా అదే లుక్ లో సూపర్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో దిగిన తన పిక్స్ ని కొద్దిసేపటి క్రితం మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. కాగా ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి.
BTS… ???? pic.twitter.com/MICYoosxwi
— Mahesh Babu (@urstrulyMahesh) June 9, 2023