మరో 25లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన మహేష్

Published on Mar 28, 2020 5:01 pm IST

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలమునకలై ఉన్నాయి. ఈనేపథ్యంలో స్టార్ హీరోలు తమ వంతు సాయంగా ఆర్ధిక మద్దతు ప్రకటిస్తూ విరాళాలు అందిస్తున్నారు.ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్ కు 50 లక్షల రూపాయల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళం ప్రకటించిన సూపర్ స్టార్ మహేష్, కాసేపటి క్రితం రోజువారీ సినిమా కార్మికుల వేతనాల కోసం రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించి మరొక్కసారి తన పెద్ద మనసు చాటుకున్నారు.
సినిమా పరిశ్రమ తాత్కాలికంగా మూత పడిన నేపథ్యంలో ఈ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోవడం జరిగింది. కరోనా కర్ఫ్యూ సమయంలో నిత్యావసర వస్తువులు కొనలేక ఇబ్బందిపడుతున్న కార్మికుల సహాయార్థం మహేష్ ఈ మొత్తం ప్రకటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :

X
More