సూపర్ స్టార్.. తన పేరు వెనకాల ఈ బిరుదు చేరడానికి మహేష్ బాబు చాలానే కష్టపడ్డారు. ఒకప్పటి టాప్ హీరో క్రిష్ణగారి వారసుడిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఆయన ప్రయాణం అంత మృదువుగా ఏమీ సాగలేదు. తండ్రి పేరు తనకొక ఎంట్రీ టికెట్ మాత్రమేనని చాలా త్వరగానే గ్రహించిన మహేష్ గెలుపే ఊపిరిగా కష్టపడ్డాడు. ఆయనలోని ఓటమిని ఒప్పుకోలేని తత్వమే ఆయన్ను అగ్ర హీరోగా హీరోగా నిలబెట్టింది.
కెరీర్లో ఎదురైన ప్రతి పరాజయాన్ని ఒక ఛాలెంజ్ అనుకునే మహేష్ తన విజయ రహస్యాన్ని బయటపెట్టారు. తాజాగా వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటోషూట్లో పాల్గొన్న ఆయన ‘పరాజయాలే నిజమైన నిధి. వాటిని విశ్లేషించుకుని, ఎంతో నేర్చుకున్నాను. ఓటమి ఎదురైనప్పుడు మొదట్లో బాధ ఎక్కువగానే ఉంటుంది. వాటి తట్టుకోవడంలో నమ్రత నాకు సహాయపడింది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా చేస్తున్నారు.