రాజమౌళి సినిమా కోసం మహేష్ ?

Published on Mar 7, 2021 2:11 am IST

ఎస్.ఎస్.రాజమౌళి తన తర్వాత సినిమా మహేష్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం మహేష్ బాబు తన ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టాడట. రాజమౌళి సినిమాలో మహేష్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడట. ఇక రాజమౌళి – మహేష్ సినిమాకి సంబంధించి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను కూడా పూర్తి చేసారట. ఈ సినిమా ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా రాబోతోందట.

మహేష్ బాబు ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా నటిస్తున్నాడట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఇక రాజమౌళి, మహేష్ సినిమా సెట్స్ కోసం డిజైన్ చేయిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సగానికి ఈ సినిమా పూర్తయిపోతుంది.

సంబంధిత సమాచారం :