మహేష్ వద్దనుకుంటే ప్రభాస్ భారీ హిట్ కొట్టాడు

Published on Aug 4, 2020 7:07 pm IST


ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రాలలో వర్షం ఒకటి. ప్రభాస్ కి మొదటి హిట్ మూవీ కూడా వర్షం కావడం విశేషం. ఆ మూవీ విజయం ప్రభాస్ స్టార్ హీరోగా ఎదగడానికి పునాది వేసింది అనాలి. 2004 సంక్రాంతికి విడుదలైన వర్షం మూవీ చిరంజీవి అంజి, బాలయ్య లక్ష్మీ నరసింహ వంటి చిత్రాలకు పోటీ ఇస్తూ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. దర్శకుడు శోభన్ ఈ చిత్రంతో భారీ హిట్ అందుకున్నారు. కాగా ఈ మూవీ మొదట మహేష్ దగ్గరికి వెళ్లిందట. దర్శకుడు వర్షం కథను మొదట మహేష్ కి వినిపించాడట.

ఐతే మహేష్ ఆ మూవీ పట్ల ఆసక్తి చూపలేదట. 2002లో దర్శకుడు శోభన్ తో మహేష్ బాబీ మూవీ చేశారు. బాబీ మూవీ ప్లాప్ గా నిలిచింది. దీనితో మరలా దర్శకుడు శోభన్ తో మహేష్ మూవీ చేయడానికి ఇష్టపడలేదు. దీనితో ఆ ఆఫర్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళింది. అలా మహేష్ వర్షం రూపంలో ఓ భారీ హిట్ మూవీని చేజార్చుకున్నారు. అదే ఏడాది ప్రభాస్ దర్శకుడు ఎస్ జే సూర్యతో నాని అనే ప్రయోగాత్మక చిత్రం చేసి ప్లాప్ అందుకున్నారు.

సంబంధిత సమాచారం :

More