సోషల్ మీడియాను రూల్ చేస్తున్న మహేష్ నయా లుక్..!

టాలీవుడ్ అల్ టైం హ్యాండ్సమ్ హంక్ సూపర్ స్టార్ మహేష్ లుక్స్ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు 40 ప్లస్ దాటినా సరే అప్పుడెప్పుడో “పోకిరి” లో చూసిన మహేష్ లానో లేక పదేళ్ల కితం వచ్చిన “ఖలేజా” లో చూసిన మహేష్ లానే కనిపిస్తాడు. ఇలా ఇన్నేళ్లయినా సరే చెక్కు చెదరని అందంతో ఉండడం మన టాలీవుడ్ లో కింగ్ నాగ్ తర్వాత ఒక్క మహేష్ కే చెల్లింది అని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా మహేష్ ఇక లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ షూట్ కు బయటకొచ్చారు. అందులో భాగంగా ఒక యాడ్ షూట్ కోసం బయటకొచ్చిన మహేష్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోయింది. దీనితో ఈ ఫోటో చూసి మహేష్ ఫ్యాన్స్ ఏజ్ ను మహేష్ మరోసారి రివర్స్ గేర్ లో పెట్టి లాగేసారని అంటున్నారు. జస్ట్ క్లాస్ గా స్టైలిష్ హైర్ కట్ తో దర్శనం ఇచ్చిన మహేష్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో మరియు ఇతర హీరోల అభిమానులలో సైతం మంచి హాట్ టాపిక్ అయ్యిపోయింది.

Exit mobile version