ఆ సంఘటన భయానకం- మహేష్

Published on Aug 5, 2020 2:33 pm IST

లెబనాన్ దేశం నేటి సంఘటనతో ఉలిక్కి పడింది. ఆ దేశ రాజధానిలో బీరట్ లో సంభవించిన భారీ పేలుడు నగరాన్ని ధ్వంసం చేసింది. అగ్నిప్రమాదంగా మొదలైన సంఘటన భారీ పేలుడుకు కారణం అయ్యింది. ఓ గోడౌన్ లో దాచివుంచిన 2700 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ భారీ పేలుడుకు కారణం అని తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 100మంది మరణించగా, 4000 వరకు గాయాలపాలు అయ్యారు.

ఇక ఈ ఘటనలో 2.5 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. కాగా ఈ సంఘటనపై మహేష్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత భయానక సంఘటనగా మహేష్ బీరట్ పేలుళ్లను వర్ణించారు. ఇక మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్న మహేష్, ఘటన బాధితుల కోసం దేవుణ్ణి ప్రార్ధించారు.

సంబంధిత సమాచారం :

More