సూపర్ స్టార్ మహేష్ కి సంబంధించిన అరుదైన ఫోటో ఒకటి సోషల్ మీడియాలలో వైరల్ గా మారింది. ఆఫొటో చూసిన మహేష్ ఫ్యాన్స్ ఫిదా కావడంతో పాటు, లైక్స్ షేర్స్ తో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అంతగా అభిమానులను ముచ్చట గొలిపిన ఆ ఫొటో ప్రత్యేకత ఏమిటి అంటారా?. ఆ ఫోటో మహేష్ ఐదారేళ్ళ చిన్నప్పటిది కావడమే. డెనిమ్ జాకెట్ ధరింది కెమెరా వైపు క్యూట్ గా చూస్తున్న మహేష్ ఫోటో అద్భుతంగా ఉంది. 1975లో పుట్టిన మహేష్ ఐదేళ్ల వయసంటే షుమారు 1980లో ఈ ఫోటో తీసి వుంటారు.
ఇక మహేష్ ప్రస్తుతం నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్ లో వేసిన కర్నూల్ కొండారెడ్డి బురుజు సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.