వైరల్ : లేటెస్ట్ లుక్ లో నమ్రత తో మహేష్ కూల్ పిక్

Published on Aug 13, 2022 3:00 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి విదేశాల్లో సరదాగా హాలిడే ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసినీ క్రియషన్స్ సంస్థ నిర్మించనున్న తన కెరీర్ 28వ సినిమాలో నటించనున్నారు మహేష్.

తమన్ సంగీతం అందించనున్న మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా ఈ మూవీ కోసం మహేష్ బాబు ఫుల్ గా క్రాప్ తో పాటు గడ్డం పెంచి స్టైలిష్ లుక్ లో రెడీ అయ్యారు. ఇక కొద్ది సేపటి క్రితం భర్త మహేష్ తో కలిసి స్విట్జర్లాండ్ లోని ఒక ప్రముఖ హోటల్ వద్ద దిగిన ఒక కూల్ పిక్ ని నమ్రత శిరోద్కర్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ పిక్ లో మహేష్ బాబు అదిరిపోయే స్టైల్ గమనించవచ్చు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతుంది

సంబంధిత సమాచారం :