సుకుమార్, మహేష్ బాబు.. ఆసక్తికరం

Published on Feb 25, 2021 11:06 pm IST

మహేష్ బాబు సుకుమార్ సహా నిర్మాతగా వ్యవహరించిన ‘ఉప్పెన’ సినిమాను చూసి తెగ మెచ్చుకున్నారు. క్లాసిక్ అనే కితాబిచ్చారు. సినిమా మీద ప్రశంసలు వర్షం కురిపించారు. అంతేకాదు సుకుమార్ ఇంట జరిగిన ఒక వేడుకకు మహేష్ కుటుంబంతో సహా హాజరయ్యారు. సినిమా చూశాక సోషల్ మీడియాలో పొగడటమే కాదు నేరుగా సుకుమార్ కు ఫోన్ చేసి సినిమాను, సినిమాలోని అంశాలను మెచ్చుకుని అంత మంచి సినిమాను రూపొందించినందుకు చిత్ర బృందం మీద ప్రశంసలు కురిపించారు. మహేష్ నుండి వచ్చిన ఈ స్పందనకు సుకుమార్ చాలా థ్రిల్ అయ్యారు.

మామూలుగా అయితే ఈ విషయాన్ని అంతగా చర్చించుకోవాల్సిన పనిలేదు. కానీ గతంలో సుకుమార్, మహేష్ మధ్యన తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ నేపథ్యంలో ఈ అంశం సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. సుకుమార్, మహేష్ గతంలో ‘వన్ నేనొక్కడినే’ సినిమా చేశారు. బాక్సాఫీస్ పరంగా సినిమా పెద్దగా రాణించలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు పొందింది. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేద్దామనుకుని కథను సిద్ధం చేసుకున్నారు. కానీ ఆ కథ మహేష్ బాబుకు నచ్చలేదు. దాంతో ప్రాజెక్ట్ ఆగిపోయి తర్వాత ఎవరికి వారు విడివిడిగా సినిమాలు మొదలుపెట్టుకున్నారు.

ఈ విబేధం వలన వీరు ఇకపై కలిసి సినిమా చేసే అవకాశం లేదని చాలామంది భావించారు. చేసినా ఇప్పుడప్పుడే ఉండదని అనుకున్నారు. కానీ అందరూ అనుకుంటున్నారు మహేష్, సుకుమార్ మధ్యన విబేధాలు ఏమీ లేవని, అంతా సజావుగానే ఉందని తాజాగా పరిణామాలతో రూఢీ అయింది. అంతేకాదు మహేష్ త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో నటిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

సంబంధిత సమాచారం :