మహేష్ – త్రివిక్రమ్ మూవీ అంచనాలు అందుకోవడం ఖాయమట

Published on Jul 6, 2022 1:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఎంతో పెద్ద సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. పరశురామ్ పెట్ల తీసిన ఈ ప్రతిష్టాత్మక మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. ఇక దీని తరువాత త్రివిక్రమ్ తో మహేష్ చేయనున్న ఆయన కెరీర్ 28వ సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్న ఈ భారీ మూవీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. అయితే ఈ మూవీకి సంబంధించి మొన్న స్టోరీ ఫైనల్ నారేషన్ ని మహేష్ కి వినిపించిన దర్శకుడు త్రివిక్రమ్ ఈనెల చివర్లో దీనిని మొదలెట్టనున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా పదేళ్ల గ్యాప్ యువత మహేష్ , త్రివిక్రమ్ నుండి వస్తున్న మూవీ కావడంతో దీనిపై రోజు రోజుకి అందరిలో అంచనాలు మరింతగా పెరుగుతూ పోతున్నాయి. అయితే పక్కాగా అందరి అంచనాలు అందుకోవడం తోపాటు ముఖ్యంగా మహేష్ ఫాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా దర్శకుడు త్రివిక్రమ్ ఈ స్టోరీ రెడీ చేసారని, తప్పకుండా రిలీజ్ తరువాత మూవీ మంచి సక్సెస్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మది ఫోటోగ్రఫి అందించనున్న ఈ మూవీలో మహేష్ క్యారెక్టర్ అదిరిపోతుందట.

సంబంధిత సమాచారం :