ముందుగా ధైర్యం చేసింది మహేష్ బాబే !

Published on Dec 1, 2020 5:08 pm IST

కరోనా దెబ్బకు అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడ ఏడు నెలలు మూతబడింది. సినిమాలు లేకపోవడంతో థియేటర్లు క్లోజ్ అయ్యాయి. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమా హాళ్లు తెరుచుకోమని ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా థియేటర్ యాజమాన్యాలు మాత్రం ఆ సాహసం చేయలేకపోయాయి. తెరిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోననే ఆందోళన అందరిలోనూ నెలకొంది. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ చైన్ మాత్రం థియేటర్లు తెరుస్తున్నట్టు ప్రకటించింది.

ఈ డిసెంబర్ 4వ తేదీ నుండి సినిమా హాళ్లు తెరవనున్నట్టు అధికారికంగా ప్రకటన చేశారు. ఈరోజు మంగళవారం నుండి టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. కరోనా తర్వాత ఇలా థియేటర్లు రీఓపెన్ చేస్తున్నట్టు ప్రకటన చేసిన మొదటి థియేటర్ చైన్ ఏఎంబీ సినిమాస్ మాత్రమే కావడం విశేషం. ఈ ప్రకటనతో కొన్ని నెలలుగా థియేటర్ అనుభూతిని మిస్సైన సినీ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు బృందం చేస్తున్న ఈ ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తే త్వరలోనే ఇంకొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

More