పోలీసులకు మహేష్ సెల్యూట్..!

Published on Apr 9, 2020 11:45 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు పోలీసుల నిరంతర శ్రమను, త్యాగనిరతిని ట్విట్టర్ వేదికగా కొనియాడారు. కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకొనే యుద్ధంలో తెలంగాణా పోలీసుల నిబద్ధతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. కరోనా వైరస్ విజృంభణ మొదలైనప్పటి నుండి పోలీసులు రోడ్లపై, రేయి పగలు అని తేడా లేకుండా డ్యూటీలు చేస్తున్నారు. విధి నిర్వహణలో కొందరు పోలీసులు కూడా ఈ వైరస్ బారిన పడడం జరిగింది.

వారి త్యాగాన్ని, శ్రమను స్మరించుకుంటూ మహేష్ ట్విట్టర్ లో ఈ విధంగా స్పందించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణా కూడా ఉంది . సోషల్ డిస్టెన్స్ ఒక్కటే దీనిని అరికట్టే మార్గం కావడంతో కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేసే విధి నిర్వహణలో పోలీసు వ్యవస్థ కుటుంబాలకు దూరంగా ఉంటూ విధి నిర్వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More