“దేవర” కోసం మెయిన్ లీడ్ పయనం..

“దేవర” కోసం మెయిన్ లీడ్ పయనం..

Published on Jun 18, 2024 2:00 PM IST

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర”. మరి మొత్తం రెండు భాగాలుగా చేస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా సెన్సేషనల్ బిజినెస్ ని జరుపుతున్న వార్తలు వైరల్ గా మారాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. దీని ప్రకారం సినిమా మెయిన్ లీడ్ ఎన్టీఆర్ అలాగే జాన్వీ కపూర్ లు థాయిలాండ్ కి పయనం కానున్నారట. అక్కడ కొరటాల ఇద్దరి మధ్య ఓ బ్యూటిఫుల్ సాంగ్ ని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ ఆల్రెడీ ఒక సెన్సేషనల్ నెంబర్ ని అందించాడు. మిగతా ట్యూన్స్ కూడా అదే లెవెల్లో వస్తున్నాయని టాక్ కూడా ఉంది. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు