గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి – క్లీన్ హిట్ అంటోన్న మేక‌ర్స్!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి – క్లీన్ హిట్ అంటోన్న మేక‌ర్స్!

Published on Jun 25, 2024 7:00 PM IST

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టించిన రీసెంట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ మంచి అంచ‌నాల మ‌ధ్య మే 31న థియేట‌ర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను కృష్ణ చైత‌న్య పూర్తి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కించ‌గా, విశ్వ‌క్ సేన్ త‌న‌దైన ప‌ర్ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల మిక్సిడ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి కూడా మిశ్ర‌మ రివ్యూలు రావ‌డంతో, ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి ఫ‌లితాన్ని రాబ‌డుతుందా అని అంద‌రూ భావించారు. ఇక ఈ సినిమా త్వ‌ర‌గానే ఓటిటిలోనూ స్ట్రీమింగ్ కు వ‌చ్చేయ‌డంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ ఫ‌లితంపై సందేహాలు నెల‌కొన్నాయి. అయితే, తాజాగా ఈ మూవీ రిజ‌ల్ట్ పై మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ చిత్రానికి మిశ్ర‌మ రివ్యూలు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇది అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఓ క్లీన్ హిట్ మూవీగా అవ‌త‌రించింద‌ని చిత్ర నిర్మాత‌లు తెలిపారు. ఈ సినిమాలో నేహా శెట్టి, అంజ‌లి హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నాగ‌వంశీ – సాయి సౌజ‌న్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు