యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “రాబిన్ హుడ్”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల నటించిన ఈ చిత్రాన్ని హిట్ దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు మంచి ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి అనే సమయంలో ఈ సినిమాకి టికెట్ ధరల పెంపు ఉంటుంది అనే టాక్ విస్తృతంగా వైరల్ అయ్యింది.
అయితే ఈ వార్తలపై స్వయంగా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. రాబిన్ హుడ్ సినిమాకి ధరలు పెంచాము అనే మాట అవాస్తవం అని పెంచినట్టుగా వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని కొట్టి పడేసారు. తాము సినిమాని అంతా చూసే విధంగా సరసమైన ధరలోనే తీసుకొస్తున్నట్టుగా తెలిపారు. అయితే ఆంధ్రలో మాత్రం కేవలం కొన్ని ప్రీమియం ప్రాంతాల్లో మట్టుకు స్వల్ప హైక్ ఉంటుంది తప్పితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడా కూడా ధరల పెంపు లేదని ఒక క్లారిటీ చిత్ర యూనిట్ ఇపుడు అందించింది.
Explosive entertainment at affordable prices.#Robinhood pic.twitter.com/v8W5PZKXGa
— Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2025