టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ప్రవేశానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ వర్మతో త్వరలోనే నందమూరి మోక్షజ్ఞ ఓ సినిమా చేయనున్నాడని.. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అందరూ భావించారు.
అయితే, ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని.. ప్రశాంత్ వర్మ వేరొక సినిమా పై ఫోకస్ పెట్టాడని.. దీంతో మోక్షజ్ఞ కూడా వేరొక డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు సినీ సర్కిల్స్, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ, ఇవన్నీ కూడా కేవలం పుకార్లు మాత్రమే అని మేకర్స్ తేల్చి చెప్పారు. తాజాగా దీనికి సంబంధించి వారు క్లారిటీ కూడా ఇచ్చారు.
ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ సినిమా పై వస్తున్న వార్తలన్నీ కూడా కేవలం నిరాధారమైనవి.. వాటిలో ఎలాంటి నిజం లేదు.. ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే తామే సరైన సమయంలో చెబుతామంటూ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు రానున్నాయని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
AN IMPORTANT ALERT about our Next @PrasanthVarma – @MokshNandamuri Project.
Please stop spreading fake news. All official information will come through official channels only.#PVCU2#MTejeswiniNandamuri @sudhakarcheruk5 @LegendProdOffl @ThePVCU pic.twitter.com/V9fXc7E0sy
— SLV Cinemas (@SLVCinemasOffl) December 18, 2024