కంచరపాలెం డైరెక్టర్ సెకండ్ మూవీ ఓ టి టి లో?

Published on Jun 5, 2020 1:08 am IST


లాక్ డౌన్ ఇప్పట్లో తీరే సూచనలు కనిపించడం లేదు. కరోనా కేసులు దేశంలో అంతకంతకూ పెరుగుతూ పోతున్న క్రమంలో లాక్ డౌన్ పెంచుకుంటూ పోతున్నారు. దీనితో సినిమా షూటింగ్స్ కి అనుమతి దొరికినా, థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇక చిన్న చిత్రాలు నిర్మాతలు ఓ టి టి విడుదల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఒకటి రెండు చిన్న చిత్రాలు ఓ టి టి లో విడుదలయ్యాయి.

కాగా హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య మూవీని కూడా మేకర్స్ ఓ టి టి లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. మరో రెండు నెలలు థియేటర్స్ తెరుచుకునే సూచనలు లేవు. దీనితో ఓ టి టి సరైన మార్గం అని అనుకుంటున్నారట. మొదటి చిత్రం కంచరపాలెం తో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More