మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నుండి ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు ఓ షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
NTR-Neel మూవీకి సంబంధించి ఓ బిగ్ అప్డేట్ ఏప్రిల్ 9 మధ్యాహ్నం 12.06 గంటలకు ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో అసలు ఈ సర్‌ప్రైజింగ్ అప్డేట్ ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్ర యూనిట్, ఎన్టీఆర్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి రాబోతున్న బిగ్ అప్డేట్ ఏమై ఉంటుందో చూడాలి.