తంగలాన్ లో ఆ సీన్ పై మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తంగలాన్ లో ఆ సీన్ పై మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jul 25, 2024 1:00 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియన్ ఫిల్మ్ తంగలాన్ ఆగస్ట్ 15న గ్రాండ్ రిలీజ్ కానుంది. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ పీరియడ్ డ్రామాలో మాళవిక మోహనన్ కూడా నటించింది. ట్రైలర్‌లోని ఆమె పాత్రకి సంబందించిన కొన్ని సన్నివేశాలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను మాళవిక ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మాళవిక మాట్లాడుతూ, ఓ రోజు షూటింగ్‌కి రెడీ అవుతుండగా సెట్‌లో హఠాత్తుగా ఓ పెద్ద బఫెలో కనిపించింది. రంజిత్ సర్ నన్ను చూసి ఆ బఫెలో నచ్చిందా అని అడిగారు. అది మంచి బఫెలో అని చెప్పాను. నన్ను వెళ్లి దాని మీద కూర్చోమని అడిగాడు. నేను జోక్ చేస్తున్నారేమో అని అనుకున్నా. నేను రంజిత్ సార్ దాని మీద కూర్చోలేను అని చెప్పా. ఆ సన్నివేశం గురించి నాకు ముందుగా చెప్పలేదు, అందుకే నేను అవాక్కయ్యాను. చివరికి ఆ బఫెలో మీద కూర్చున్నా అంటూ చెప్పుకొచ్చారు.

పార్వతి తిరువోతు, పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్, సంపత్ రామ్, హరి కృష్ణన్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు