ప్రభాస్ తో ఆ సినిమా చేయాల్సింది, కానీ – మాళవికా మోహనన్‌

ప్రభాస్ తో ఆ సినిమా చేయాల్సింది, కానీ – మాళవికా మోహనన్‌

Published on Dec 30, 2024 3:30 PM IST

హీరోయిన్ మాళవికా మోహనన్‌ కి ‘తంగలాన్‌’ సినిమాతో మంచి హిట్ వచ్చింది. ప్రస్తుతం ‘రాజా సాబ్‌’, ‘సర్దార్‌ 2’ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ప్రభాస్‌తో యాక్ట్‌ చేయడం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా ప్రభాస్ పై తనకున్న ఇష్టాన్ని కూడా ఈ హాట్ భామ బాహాటంగా తెలియజేసింది. ఇంతకీ, మాళవికా మోహనన్ ఏం చెప్పింది అంటే.. ‘రాజాసాబ్‌’తో నేను తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాను. ఇదొక హారర్‌, రొమాంటిక్‌ కామెడీ మూవీ. ఆ సినిమా వర్క్‌లో భాగంగా గత కొంతకాలంగా హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నా. ఈ ప్రాజెక్ట్‌ విషయంలో నేనెంతో సంతోషంగా ఉన్నాను’ అని తెలిపింది.

మాళవికా మోహనన్ ఇంకా మాట్లాడుతూ.. ‘పర్సనల్ గా ప్రభాస్‌ తో వర్క్‌ చేయడం నాకు ఎంతో సరదాగా అనిపించింది. నిజానికి నేను ‘బాహుబలి’ సినిమాకు వీరాభిమానిని. ‘బాహుబలి 1, 2’ చిత్రాలు చూసిన తర్వాత నేను ప్రభాస్‌కు పెద్ద అభిమానిని అయ్యాను. ఆయనతో ఒక్కసారైనా వర్క్ చేయాలని కలలు కన్నాను. అలాంటి సమయంలో మొదట నాకు ‘సలార్‌’ నుంచి ఛాన్స్ వచ్చింది. ప్రశాంత్‌ నీల్‌ ఒక రోల్‌ కోసం నన్ను అడిగారు. ఆ క్షణం ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు గొప్ప అవకాశం అనుకున్నా. కానీ, అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ చేయలేకపోయా. కొన్ని నెలల తర్వాత మారుతి నుంచి ‘రాజాసాబ్‌’ కోసం ఆఫర్‌ వచ్చింది. అప్పుడు నా సంతోషానికి అవధలు లేవు’ అని మాళవికా మోహనన్‌ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు