‘రుద్రంగి’ లో జ్వాలాబాయి దొరసానిగా ఆకట్టుకుంటున్న మమతా మోహన్ దాస్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

ఇటీవల దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్ సినిమాలు అలానే ఆర్ఆర్ఆర్, అఖండ వంటి ప్రతిష్టాత్మక మూవీస్ కి రైటర్ గా వర్క్ చేసిన అజయసామ్రాట్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ మూవీ రుద్రంగి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్, జగపతి బాబు లుక్ కు ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. జగపతి బాబు ఈ సినిమాలో ‘భీమ్ రావ్ దొర’ గా కనిపించనున్నారు. ఇక ఈ ‘రుద్రంగి’ సినిమా నుంచి లేటెస్ట్ గా మమతా మోహన్ దాస్ జ్వాలాబాయి దొరసాని క్యారెక్టర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. భయమెరుగని ధీరవనిత పాత్రలో ఆమె లుక్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.

అలానే ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఆమె పలికిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. నువ్వు దొర అయితే నేను దొరసానిని తగలబెడతా, ఛల్ హట్ అంటూ ఆమె చెప్పిన డైలాగ్స్ తో పాటు మోషన్ పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఆకట్టుకునే థ్రిల్లింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ‘రుద్రంగి’ లో ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్ దాస్, జగపతి బాబు, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని థియేటర్లలో త్వరగా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు. మరి అందరిలో ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పరిచిన రుద్రంగి మూవీ రిలీజ్ తరువాత ఎంత మేర ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.

Exit mobile version