యంగ్ బ్యూటీ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. షూట్ అనంతరం తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు అత్యుత్సాహం కనబరిచి.. గుంపులో ఓ వ్యక్తి ఆమె చేయి పట్టుకుని బలవంతంగా లాగారు. దీంతో, శ్రీలీల వారి వైపు ఒరిగిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ప్రేమ కథా చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది.
కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా షూట్ లో భాగంగా చిత్రబృందం ఇటీవల డార్జిలింగ్‌కు వెళ్లింది. చిత్రీకరణ అనంతరం కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఆమె తిరిగి వస్తుండగా.. వారిని చూసేందుకు స్థానికులు, అభిమానులు ఆసక్తి చూపిస్తూ ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే శ్రీలీల చేయి పట్టుకుని లాగారు. చుట్టూ బాడీగార్డులు వారిని సంరక్షిస్తున్నా.. గుంపులో నుంచి కొంతమంది ఆకతాయిలు ఆమె చేయి పట్టుకుని బలవంతంగా లాగారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి