టాలీవుడ్ హీరో శర్వానంద్ వరుస చిత్రాలు చేస్తూ, కెరీర్ లో దూసుకు పోతున్నారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మనమే (Manamey). ఈ చిత్రం అనౌన్స్ మెంట్ తోనే అందరిలో ఆసక్తి నెలకొంది. కృతి శెట్టి ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. రిలీజైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది.
ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన అప్డేట్ ను అందించారు. ఓహ్ మనమే అంటూ సాగే ఈ పాటను ఏప్రిల్ 30, 2024 న సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వహబ్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిభోట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.