నటుడుగా ఎన్నో వైవిద్యమైన పాత్రలతో నవ్వించి, హీరోగా సూపర్ సక్సస్ లు సాధించిన సునీల్ కథానాయకుడిగా, రక్ష లాంటి టెర్రిఫిక్ కథాంశంతో విమర్శకుల ప్రశంశలు అందుకున్న వెల్ టాలెంటెడ్ దర్శకుడు వంశి కృష్ణ ఆకేళ్ళ దర్శకుడిగా చిత్రం ఇటీవలే సినిప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా పూజాకార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సంభందించి రెగ్యులర్ షూటింగ్ ని అగష్టు మెదటి వారం నుండి ప్రారంభిస్తారు. చిన్నచిత్రాల్లో బ్లాక్‌బస్టర్ గా నిలవటమే కాకుండా కొత్త జానర్ ని తెలుగు సినిమా ఇండస్ట్రికి తెలుగు ప్రేక్షకుడికి పరిచయం చేసిన ప్రేమకథా చిత్రమ్ సినిమాని నిర్మించిన ఉత్తమాభిరుచి వున్న నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి ఆర్.పి.ఏ క్రియోషన్స్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం-2 గా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో హీరో సునిల్ సరసన ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సిస్టర్ మన్నార్ చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సందర్బంగా నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ..తెలుగు చలన చిత్ర పరిశ్రమకి హరర్ కామెడి అనే కొత్త జానర్ ని పరిచయం చేస్తూ ప్రేమకథా చిత్రం సినిమాతో మా బ్యానర్ ఆర్.పి.ఏ.క్రియేషన్స్ స్టార్టయింది. మూడు జెనరేషన్స్ తరువాత చిన్న చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ రేంజి కి వెలుతుందని నిరూపించిన చిత్రం ప్రేమకథా చిత్రమ్. ఇప్పటికి టివిల్లో ఈ చిత్రాన్ని చూసి ఫోన్ కాల్స్ వస్తుంటాయంటే ప్రేక్షకుల్లో ప్రేమకథా చిత్రమ్ సినిమా, మా బ్యానర్ ఎంతలా పాతుకుపోయిందో చెప్పనక్కర్లేదు. అలాంటి బ్యానర్ లో ప్రోడక్షన్ నెం-2 గా ఓ చిత్రాన్ని నిర్మిచాలంటే అదే రేంజి కథతో చేయ్యాలి. అందుకే దాదాపు ఎన్నో కథలు విన్నాను. వాటిలో కొన్ని బాగున్నా కూడా ప్రేమకథా చిత్రమ్ రేంజి కథ నే చెయ్యాలనుకుని వెయిట్ చేశాను. ఇంతలో రక్ష చిత్ర దర్శకుడు వంశి కృష్ణ ఆకేళ్ళ చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. మా బ్యానర్ లో ఇలాంటి చిత్రమే చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. వెంటనే హీరో సునీల్ కి చెప్పాము. ఆయన కూడా విన్న వెంటనే చాలా బాగుందని చెప్పి మాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇటీవలే రామానాయుడు స్టూడియోస్ లో పూజాకార్యక్రమాలు పూర్తిచేసుకున్నాము. సునీల్ కామెడి టైమింగ్ కి కరెక్ట్ గా సరిపోయె సరియైన హీరోయిన్ కోసం చూశాము. ప్రముఖ బాలీవుడ్ టాప్‌స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సిస్టార్ మున్నార్ చోప్రాని సెలక్ట్ చేశాం. బాలీవుడ్ లో జిద్ అనే చిత్రం ద్వారా మున్నార్ చోప్రా పరిచయమయ్యింది. తెలుగులో మా చిత్రం ద్వారా పరిచయం అవుతుంది. ఆద్యంతం ఎంతో ఆశక్తిగా ఉత్కంఠ భరితంగా, ఉహించని మలుపులతో, ప్రేమకథా చిత్రమ్ ని మించి కామెడి తో ఈ చిత్రం కథ ని సిధ్ధం చేశారు దర్శకుడు వంశి. మా బ్యానర్ లో ద్వారా స్టార్ కమెడియన్ అయిన సప్తగిరి ఎప్పుడు చెయ్యని ఓ వైవిధ్యమైన కామెడి పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాదు ధియోటర్ కి వచ్చిన ప్రేక్షకున్ని కడుపుబ్బ నవ్విస్తాడు. అగష్టు మెదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించి కంటిన్యూగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాము. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నిఅలరిస్తుంది అని అన్నారు
దర్శకుడు వంశి కృష్ణ ఆకేళ్ళ మాట్లాడుతూ.. హీరో సునీల్ గారితో నాకు ఇంతకు ముందే పరిచయముంది. చాలా మంచి స్నేహితుడు కూడా
మంచి కథ తీసుకురా సినిమా చేద్దాం అని చాలా సార్లు అన్నారు. రక్ష చిత్రం తరువాత నేను కమర్షియల్ చిత్రం చేయాలని ఈ కథని రాశాను. సినిమా ల పట్ల మంచి ప్యాషన్ విలువ వున్న నిర్మాత ఆర్. సుదర్శన్ రెడ్డి గారికి కథ చెప్పాను. ఆయనకి ఎంతగానో నచ్చి వెంటనే చెద్దామని చెప్పి సునీల్ గారికి కథ చెప్పాము. ఆయన ఎమాత్రం ఆలోచించకుండా మనం చెద్దాం అన్నారు. ఇటీవలే సినీ ప్రముఖుల సమక్షంలో పూజాకార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రం లో సునీల్ గారు కామెడి టైమింగ్ మిస్ కాకుండా యాక్షన్ చేస్తారు. సునీల్ గారిలోని కామెడిని, యాక్షన్ ని మిక్స్ చేసి చూపిస్తున్నాం. అంతే కాకుండా ఊహించని మలుపులతో కోత్తగా వుంటుంది. ధియోటర్ కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని ఓక ఉత్కంఠ కి లోను చేసి పూర్తిగా నవ్వించి పంపిస్తాము. సప్తగిరి ఈ చిత్రంలో ఫుల్‌ప్లెడ్జ్‌డ్ పాత్రలో నటిస్తున్నాడు. సప్తగిరి కామెడి తన గత చిత్రాలను మించి వుండబోతుంది. అగష్టు నుండి సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈచిత్రంలో హీరో సునీల్ సరసన బాలీవుడ్ హీరోయిన్ మన్నార్ చోప్రా నటిస్తుంది. సునీల్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటుంది.. అని అన్నారు..
యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో సునీల్, మన్నార్ చోప్రా(పరిచయం), కభీర్ సింగ్(జిల్ ఫేమ్), సప్తగిరి , నాగినీడు, తాగుబోతు రమేష్, ప్రదీప్ రావత్, పృద్వి, రాజారవీంద్ర,సుప్రీత్ రెడ్డి, షఫి, అదుర్స్ రఘు, ప్రగతి, శ్రావ్య, పవిత్రా నాయర్ తదితరులు నటిస్తుండగా..
సంగీతం:ధినేష్, ఆర్ట్ : రమణ వంకా, కెమెరా: సాయి శ్రీరామ్, ఎడిటర్ :ఎమ్.ఆర్.వర్మ, కో-డైరక్టర్స్ : రామచంద్రరావు, శివాంజనేయులు, కాస్ట్యూమ్స్: మస్తాన్, పి.ఆర్.వో: ఏలూరు శ్రీను సహ-నిర్మాతలు: మాస్టర్ ఆర్.ఆయుష్ రెడ్డి, ఆర్.పి.అక్షిత్ రెడ్డి,
నిర్మాత.:ఆర్.సుదర్శన్ రెడ్డి, కథ-స్కీన్‌ప్లే -దర్శకత్వం :వంశి కృష్ణ ఆకేళ్ళ