మంచు ఫ్యామిలీలో గత కొద్ది రోజులుగా మనస్పర్థలు తలెత్తడంతో ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ గొడవలు తారా స్థాయికి చేరుకోవడంతో మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబుల మధ్య నెలకొన్న సమస్య కారణంగా మరోసారి వీరు రోడెక్కారు. ఇక మంచు మనోజ్‌ను ఒక్కడిని చేసి విష్ణు, మోహన్ బాబు తనపై దౌర్జన్యానికి దిగారంటూ మనోజ్ విమర్శలు చేశాడు. అయితే, ఆ గొడవ సద్దు మునగడంతో వీరి కుటుంబ కలహాలు చల్లా రాయని అందరూ అనుకున్నారు.
కానీ, ఇప్పుడు మరోసారి మంచు పంచాయతీ రోడ్డెక్కింది. మంచు విష్ణు తనపై దౌర్జన్యం చేస్తున్నాడని.. తనకు సంబంధించిన కారును ఎత్తుకెళ్లాడంటూ మనోజ్ విమర్శలు చేశాడు. జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి వచ్చిన మనోజ్ అక్కడ ధర్నాకు దిగాడు. కన్నప్ప చిత్రానికి పోటీగా తన భైరవం సినిమా రిలీజ్ అవుతుందనే కారణంతో విష్ణు ఈ విధంగా చేస్తున్నాడని మనోజ్ మండిపడ్డారు.
మంచు ఫ్యామిలీలోని వివాదం మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ ఫ్యామిలీ ఇష్యూపై కోర్టు కూడా జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.