ప్రస్తుతం మంచు వారి కుటుంబంలో జరుగుతున్నా రగడ కోసం అందరికీ తెలిసిందే. అయితే యంగ్ హీరో మంచు మనోజ్ అలాగే తన తండ్రి మంచు మోహన్ బాబు సహా మంచు విష్ణు లతో పోరాటం చేస్తున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఎవరి వైపు న్యాయం, అన్యాయం ఉన్నాయి అనేది పక్కన పెడితే ముగ్గురు విషయంలో కూడా మంచి హీట్ వాతావరణం కనిపిస్తుంది.
ఓ పక్క మంచు విష్ణు తన భారీ చిత్రం కన్నప్ప పనులు వదులుకొని హైదరాబాద్ కి రాగా ఈ గొడవల్లోనే లేటెస్ట్ గా మంచు మనోజ్ షూటింగ్ లో అయినట్టుగా తెలుస్తుంది. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో చేస్తున్న చిత్రమే “భైరవం”. సాలిడ్ మాస్ చిత్రంగా చేస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ కూడా నటిస్తున్నాడు. మరి ఫైనల్ గా తమ కుటుంబ గొడవలు జరుగుతున్నప్పటికీ మనోజ్ షూటింగ్ కి ఇచ్చిన డేట్స్ ని స్పాయిల్ చెయ్యకుండా తన డెడికేషన్ చూపిస్తున్నాడని చెప్పొచ్చు.