అదిరే మూమెంట్స్ తో “కన్నప్ప” టీజర్.. సర్ప్రైజింగ్ గా ప్రభాస్ విజువల్

అదిరే మూమెంట్స్ తో “కన్నప్ప” టీజర్.. సర్ప్రైజింగ్ గా ప్రభాస్ విజువల్

Published on Jun 14, 2024 5:09 PM IST

డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా తన కెరీర్ డ్రీం ప్రాజెక్ట్ గా ప్రముఖ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తుండగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఇక గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు ఈ అవైటెడ్ టీజర్ ని ముందుగా హైదరాబాద్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు.

మరి ఇక్కడ నుంచే టీజర్ వైరల్ గా మారిపోయింది. అయితే ఈ టీజర్ మాత్రం ఫుల్ ఆన్ యాక్షన్ తో అదిరే లెవెల్లో ఉందని చెప్పాలి. శివలింగం విషయంలో కాలముఖులకి కన్నప్పకి జరిగే పోరాట సన్నివేశాలు అన్నీ ఓ రేంజ్ లో ఇంటెన్స్ గా ఉన్నాయి. ఇక తన రోల్ లో మంచు విష్ణు సాలిడ్ ఫిజిక్ తో యాక్షన్ సీన్స్ అన్నీ అలవోకగా చేసేస్తున్నాడు.

మరి ఈ సినిమా గ్రాండ్ మల్టీ స్టారర్ అని తెలిసిందే. అలా ఇందులో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) పై కేవలం ఒక్క షాట్ ఒక్క సెకను మాత్రమే ఉంది కానీ ఇది ఓ రేంజ్ కిక్ ని ఇచ్చింది. కేవలం తన కళ్ళు మాత్రమే చూపించారు. అవే ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించాయి.

ఇక తనతో పాటుగా కాజల్ (Kajal) ని కూడా ఇలానే రివీల్ చేయగా అనుకున్నట్టుగానే ఫైనల్ గా ఆ పరమ మహాశివునిగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) నే చేస్తున్నట్టుగా రివీల్ అయ్యిపోయింది. ఇంకా ఈ టీజర్ కి స్టీఫెన్ డావేసి ఇచ్చిన స్కోర్ బాగుంది. విజువల్స్ కూడా బాగున్నాయి. మరి ఓవరాల్ గా ఈ సినిమా అవుట్ పుట్ ఎలా వస్తుందో చూడాలి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు