20 మిలియ‌న్ వ్యూస్ దాటిన ‘క‌న్న‌ప్ప టీజ‌ర్

20 మిలియ‌న్ వ్యూస్ దాటిన ‘క‌న్న‌ప్ప టీజ‌ర్

Published on Jun 22, 2024 11:00 PM IST

మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘క‌న్న‌ప్ప’ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ముఖేష్ కుమార్ సింగ్ తెర‌కెక్కిస్తుండ‌గా, పూర్తి హిస్టారిక‌ల్ మూవీగా ఈ సినిమాను మేక‌ర్స్ తీర్చిదిద్దుతున్నారు.

ఇక ఈ సినిమా టీజ‌ర్ ను చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేశారు. చ‌క్క‌టి విజువ‌ల్స్, ఆక‌ట్టుకునే యాక్ష‌న్ తో ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అయితే, ఈ టీజ‌ర్ తాజాగా యూట్యూబ్ లో ఓ రికార్డును క్రియేట్ చేసింది. క‌న్న‌ప్ప టీజ‌ర్ ఏకంగా 20 మిలియ‌న్ల వ్యూస్ మార్క్ ను దాటింది.

ఈ సినిమాలో విష్ణుతో పాటు అక్ష‌య్ కుమార్, మోహ‌న్ బాబు, ప్ర‌భాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను త్వ‌ర‌లోనే రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు