తిన్నడుగా ఆకట్టుకున్న మంచు అవ్రామ్‌

తిన్నడుగా ఆకట్టుకున్న మంచు అవ్రామ్‌

Published on Aug 26, 2024 12:08 PM IST

మంచు ఫ్యామిలీ నుంచి మరో తరం తెరపై సందడి చేయడానికి రెడీ అయ్యింది. హీరో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్‌ ‘కన్నప్ప’లో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా నేడు కృష్ణాష్టమి సందర్భంగా అవ్రామ్‌ లుక్‌ ను కన్నప్ప టీమ్ రిలీజ్ చేసింది. అవ్రామ్‌ తిన్నడుగా నటించనున్నాడు. మంచువిష్ణు చిన్నప్పటి పాత్రను ఇందులో అవ్రామ్‌ పోషిస్తున్నాడు. ఈ పోస్టర్‌ను మోహన్‌ బాబు పోస్ట్‌ చేసి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

‘కన్నప్ప’ సినిమా విషయానికొస్తే.. మంచు విష్ణు టైటిల్‌ పాత్రలో ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రానున్న పాన్‌ ఇండియా సినిమా ఇది. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్‌ కథానాయిక. ప్రభాస్, అక్షయ్‌ కుమార్, శరత్‌కుమార్, మోహన్‌లాల్‌ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ బాగానే ఆకట్టుకుంది. సినిమా పై అంచనాలను పెంచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు