డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న “మంగళవారం”


పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించిన మంగళవారం సినిమా రీసెంట్ గా ఆడియెన్స్ ముందుకొచ్చి ఘన విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం సినిమాను రూపొందించారు. నందిత శ్వేత, దివ్య పిల్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ సినిమా త్వరలో డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది.

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మంగళవారం సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రీమియర్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. ఈ నెలలోనే మంగళవారం సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ కానుంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటీటీ రికార్డ్స్ కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version