సమంతాకు “నో” చెప్పిన మణిరత్నం

సమంతాకు “నో” చెప్పిన మణిరత్నం

Published on Oct 28, 2011 1:16 PM IST


సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నం హీరోయిన్ వేటలో ఉన్నట్టు మనకు తెలుసు. హీరో కార్తీక్ కుమారుడు గౌతం సరసన నటింప చేయబోయేటందుకు ఈ గాలింపు జరుపుతున్నారు. మనిరత్నంకు కార్తిక్ తో ప్రత్యేకానుబంధం ఉంది. గతంలో మణి ‘ఘర్షణ’, ‘మౌన రాగం’ తదితర చిత్రాల్లో కార్తీక్ తో కలసి పనిచేసారు. ఈ రాబోయే చిత్రానికి సంగీతం, ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ అందిస్తారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాకపోవటం మణి కి కాస్త ఇబ్బందిగా పరిణమించింది.

సూటబుల్ హీరోయిన్ కోసం అన్వేషిస్తోన్న తరుణంలో మణి ఫ్రెండ్స్ లో ఒకరు సమంతా ను సిఫార్సు చేసినట్టు తెలిసింది. కాగా, సమంతా పంపించిన ఫొటోస్ ను ఆయన పరిశీలించారు. వీటిలో ఆమె తాజా బ్లాక్ బస్టర్ మూవీ దూకుడు సినిమాలోని క్లిప్పింగులు కూడా ఉన్నాయి. అయితే, ఇవి మణి దృష్టిని ఆకర్షించ లేదని తెలిసింది. వీటిని మణి సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. మణి “నో” తో సమంతా హర్ట్ అయినట్టు వినికిడి. మణిరత్నం ప్రాజక్టు తో ఈ ఏడాదిని దిగ్విజయంగా పూర్తి చేయాలను కున్న సమంతా కు ఈ వార్త నిరాశను మిగిల్చింది. ఈ సందర్భంలో పాత సామెత ఏమిటంటే, ముందున్నవి మంచిరోజులని.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు