మణిరత్నంకు భారీ ఆఫర్ వచ్చిందట ?

Published on Jan 13, 2021 1:05 am IST


స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది దర్శకులు ఈ నవలను సినిమాగా తీయాలని అనుకున్నా కుదరలేదు. ఎట్టకేలకు మణిరత్నం ఆ పని చేస్తున్నారు. అందుకే సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ పిరియాడికల్ డ్రామాలో విక్రమ్, అమితాబ్, ఐశ్వర్యరాయ్, కీర్తి సురేష్, త్రిష, నయనతార, విజయ్ సేతుపతి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు, జయరామ్ లాంటి ప్రముఖ స్టార్లు నటిస్తుండటం మరొక ప్రత్యేకత.

తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడ సినిమా రిలీజ్ ఉండనుంది. ఈ చిత్ర నిర్మాణంలో మణిరత్నం కూడా ఒక భాగస్వామి. ఆయనకు ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ అఫర్ ఇచ్చినట్టు తమిళ సినీ వర్గాల టాక్. సినిమా యొక్క డిజిటల్ హక్కుల కోసం పెద్ద మొత్తం చెల్లించడానికి నెట్ ఫ్లిక్స్ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇంత భారీ, ప్రతిష్టాత్మకమైన సినిమాను మణిరత్నం థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయడానికి అంగీకరించే అవకాశాలు చాలా తక్కువ. మరి ఈ డీల్ కుదురుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More