మణిరత్నం “పొన్నియిన్ సెల్వన్” తెలుగు ప్రీ రిలీజ్ వేడుక కి సర్వం సిద్ధం!

Published on Sep 21, 2022 1:30 pm IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన కోలీవుడ్ బిగ్గీ పొన్నియిన్ సెల్వన్ 1 సెప్టెంబర్ 30, 2022 న ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన భారతీయ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. గత కొన్ని రోజులుగా దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ప్రమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేయడం జరిగింది.

ఈ మేరకు హైదరాబాద్ కి చిత్ర యూనిట్ రానుంది. పొన్నియిన్ సెల్వన్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 23, 2022 న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌ లోని JRC కన్వెన్షన్స్‌ లో జరగనున్నట్లు పేర్కొనడం జరిగింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో జయం రవి, విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, శోభిత ధూళిపాళ, త్రిష మరియు ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :