తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు మణిశర్మ. చాలా ఏళ్ళ నుండి ఎన్నో అద్బుతమైన ఆల్బమ్స్ ఇచ్చిన మణిశర్మ, ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను అత్యధికంగా తీసుకున్న రెమ్యునరేషన్ గురించి వివరించారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఇంద్ర చిత్రానికి అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి కోటి రూపాయలను సింగిల్ షాట్ లో తీసుకున్నట్లు తెలిపారు. ఇదే తన తొలి అత్యధిక రెమ్యునరేషన్ అని అన్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ తదుపరి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం ఆగస్టు 15 వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో థియేటర్ల లోకి రానుంది.