‘ది ఫ్యామిలీ మ్యాన్ – 3’ షూటింగ్‌ ముగిసింది !

‘ది ఫ్యామిలీ మ్యాన్ – 3’ షూటింగ్‌ ముగిసింది !

Published on Dec 30, 2024 12:01 PM IST

‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఐతే, ఇప్పటివరకు ఈ సిరీస్ రెండు సీజన్లుగా వచ్చింది. రెండో సీజన్ కూడా బాగా మెప్పించింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మూడో సీజన్ కి సంబంధించి షూటింగ్‌ పై విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పేయీ క్లారిటీ ఇచ్చారు. ఈ సిరీస్‌లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన ఓ పోస్ట్‌ పెట్టారు.

మనోజ్‌ బాజ్‌పేయీ తన పోస్ట్ లో ఏం రాసుకొచ్చారంటే.. ‘విజయవంతంగా మూడో సీజన్‌ షూటింగ్‌ ముగిసింది. త్వరలో సరికొత్తగా ఈ ఫ్యామిలీ మ్యాన్‌ మీ ముందుకు రాబోతున్నాడ’’ని ఆయన రాసుకొచ్చారు. ఈ మూడో సీజన్ లో దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్‌ తివారీగా మనోజ్‌ బాజ్‌పేయీ కనిపించనున్నారు మనోజ్‌. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లో ప్రియమణి, షరీబ్‌ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్‌ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు