మన సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్న ప్రముఖ సినీ పరిశ్రమల నుంచి కొందరు లెజెండ్స్ నటీనటుల కలయికలో మొత్తం 9 మంది దర్శకుల సమాహారం కలిసి చేసిన ఓ ఇంట్రెస్టింగ్ ఆంథాలజీ సిరీస్ నే “మనోరథంగల్”. మరి ఇందులో లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan), మమ్ముట్టి (Mammootty) అలాగే మోహన్ లాల్ (Mohan Lal) లాంటి దిగ్గజాలతో పాటుగా మరో వెర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా కనిపిస్తున్నాడు. మరి ఈ సిరీస్ ని ప్రముఖ ఓటిటి యాప్ జీ 5 వారు రివీల్ చేయగా ఈ సిరీస్ పై ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.
అయితే ఈ సిరీస్ మళయాళంకి చెందిన ప్రముఖ దర్శకుడు రచయిత అయినటువంటి ఎం టి వాసుదేవన్ రచన ఆధారంగా తెరకెక్కించగా కమల్ ఈ పాత్రలపై కథకుడిగా కనిపిస్తున్నారు. ఇక ఈ సిరీస్ లో అయితే మొత్తం 9 స్టోరీస్ వేటికవే ప్రత్యేకం కాగా ఇవన్నీ కూడా డిఫరెన్స్ ఎమోషన్స్ తో కనిపిస్తున్నాయి. అలాగే వీటిలో అయితే మోహన్ లాల్ స్టోరీ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇలా డిఫరెంట్ గా చేసిన ఈ ప్రయత్నం ఈ ఆగస్ట్ 15 నుంచి జీ 5 లో అందుబాటులోకి రానుంది. అలాగే ఇది తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి రానుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.