మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించిన రీసెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మార్కో’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ది మోస్ట్ వైలెంట్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సెన్సేషనల్ రెస్పాన్స్‌తో ఏకంగా రూ.115 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
అయితే, ఈ సినిమాను ఫిబ్రవరి 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోని లివ్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ గతంలో వెల్లడించారు. కానీ, తాజాగా ఈ సినిమా ఒక్క రోజు ముందుగానే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ చిత్రం మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు సోని లివ్‌లో చూసి ఎంజాయ్ చేయవచ్చని చిత్ర యూనిట్ తెలిపింది. హనీఫ్ అదెని డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని షరీఫ్ మహమ్మద్ ప్రొడ్యూస్ చేశారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.