మలయాళంలో ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ‘మార్కో’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ది మోస్ట్ వయొలెంట్ మూవీగా ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రమోట్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలోని వయొలెన్స్ సీక్వె్న్స్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సైతం ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ సాలిడ్ హిట్‌గా నిలిచింది.
‘మార్కో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దుమ్మురేపింది. ఇక ఇప్పుడు ఈ సినిమా తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మార్కో చిత్రం తాజాగా 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాకు ఈ రేంజ్‌లో ఆదరణ చూపిన ప్రేక్షకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా, అందులోనూ మార్కో తన మార్క్ చూపిస్తున్నాడు. ఈ సినిమాకు ఓటీటీలోనూ సెన్సేషనల్ రెస్పాన్స్ రావడం విశేషం. ఈ సినిమాను హనీఫ్ అదేని డైరెక్ట్ చేయగా షరీఫ్ మొహమద్ ప్రొడ్యూస్ చేశారు.