అక్కడ ఆడియెన్స్ కి స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మార్కో”

అక్కడ ఆడియెన్స్ కి స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మార్కో”

Published on Feb 19, 2025 10:03 AM IST


మలయాళ స్టార్ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ వైలెంట్ యాక్షన్ చిత్రం “మార్కో” కోసం అందరికీ తెలిసిందే. ఒక్క మలయాళ సినిమా దగ్గర మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఊహించని హింసాత్మక చిత్రంగా ఆడియెన్స్ చెప్పుకొచ్చారు. అయితే తెలుగు, హిందీ భాషల్లో కూడా మంచి వసూళ్లు అందుకున్న ఈ సినిమా రీసెంట్ గానే ఓటీటీలో వచ్చేసింది. ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో సోని లివ్ వారు తీసుకొచ్చారు.

అయితే వీరితో పాటుగా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు కూడా ఈ సినిమాను తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇండియా వెర్షన్ లో సహా యూఎస్ లో కూడా తెలుగులో తెస్తున్నట్టు తెలిపారు. అయితే అక్కడ ఆడియెన్స్ కి ఇపుడు సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సో యూఎస్ ఆడియెన్స్ ఈ వైలెంట్ యాక్షన్ ని విట్నెస్ చెయ్యొచ్చు. ఇక ఇండియాలో మాత్రం ఈ ఫిబ్రవరి 21న అందుబాటులోకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు