ఓటిటిలో మాత్రం తేలిపోయిన మోస్ట్ వైలెంట్ సినిమా

ఓటిటిలో మాత్రం తేలిపోయిన మోస్ట్ వైలెంట్ సినిమా

Published on Feb 27, 2025 10:00 PM IST

మన ఇండియన్ సినిమా దగ్గర వైలెన్స్ బ్యాక్ డ్రాప్ లో చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఆ వైలెన్స్ ని కూడా పద్దతిగా చూపించడం వేరు ఇంకా సహజంగా చూపించడం కూడా వేరు. ఇలా రెండు రకాలుగా కూడా పలు సినిమాలు వచ్చి అలరించాయి. అయితే ఈ పాయింట్ ని కొంచెం సమంజసంగా ప్రొజెక్ట్ చేస్తే ఓకే కానీ అనవసరంగా ఇరికించినట్టుగా ప్లాన్ చేస్తేనే ఆడియెన్స్ నుంచి విమర్శలు తప్పవు.

మన ఇండియన్ సినిమా దగ్గర “కిల్” అనే సినిమా హిందీ నుంచి వచ్చి ఇండియా వైడ్ గా సంచలనం రేపింది. అందులో వైలెన్స్ అంతా చాలా నాచురల్ గా అర్ధవంతంగా చూపించేసరికి ఆడియెన్స్ మన ఇండియన్ సినిమా దగ్గరే బెస్ట్ వైలెన్స్ సినిమాగా దానిని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా తర్వాత ఆ రేంజ్ లో లేపిన మరో సినిమానే “మార్కో”. కన్నడ సినిమా నుంచి వచ్చిన ఈ సినిమాలో వైలెన్స్ ఉంది కానీ దానికి అర్ధం లేదు అనే కామెంట్స్ వచ్చాయి.

మెయిన్ గా హీరో రోల్ తన కుటుంబాన్ని విలన్స్ చంపేసినపుడు అంతా ఏం చెయ్యలేకపోయాడు కానీ ఆ తర్వాత వెంటనే నీట్ గా స్నానం చేసి రెడీ అయ్యి విలన్స్ ని చంపడానికి వెళ్లడం అనే పాయింట్ అయితే ఓటిటిలో వచ్చాక అసలు ఈ సినిమాని ఎందుకు అంత లేపారు అనే ప్రశ్నలే ఎక్కువ వస్తున్నాయి. ఇలా అప్పుడు థియేటర్స్ లో కంటే ఓటిటిలో వచ్చిన తర్వాత ఆడియెన్స్ ఇలాంటి లూప్ హోల్స్ పై మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప థియేటర్స్ లో ఉన్నపుడు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం ఇపుడు దీనికి రావడం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు