ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మార్కో’.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మార్కో’.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

Published on Jan 31, 2025 10:03 PM IST

మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మార్కో’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకుంది. పూర్తి యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులు బ్లడ్ బాత్ అంటే ఏమిటో చూపెట్టింది. యాక్షన్ సీక్వెన్స్‌లను నెక్స్ట్ లెవెల్‌లో ప్రెజెంట్ చేసిన ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకులు మంచి రిజల్ట్‌ను అందించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది.

‘మార్కో’ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఇక కేవలం మలయాళంలోనే కాకుండా హిందీ, తెలుగు భాషల్లోనూ ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాను సోనీ లివ్ పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సోనీ లివ్ ప్రకటించింది.

ఈ సినిమాను హనీఫ్ అదెని డైరెక్ట్ చేయగా షరీఫ్ మహ్మద్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో యుక్తి తరేజా, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరి ‘మార్కో’ ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో తెలియాలంటే ఫిబ్రవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు