హీరోతో పెళ్లి ఫిక్స్ అంటున్న ‘గుత్తా జ్వాల’ !

Published on Mar 31, 2020 5:29 pm IST

స్టార్ బ్యాడ్మింటన్‌ ప్లేయర్ గుత్తా జ్వాల గత కొన్నాళ్లుగా తన గేమ్ కంటే కూడా తన కామెంట్లతోనే న్యూస్ లో హాట్ టాపిక్ అవుతుంది. తమిళ యాక్టర్ విష్ణు విశాల్‌ తో కొన్నాళ్లుగా గుత్తా జ్వాల డేటింగ్‌ లో ఉంది. కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జ్వాల, విష్ణు విశాల్‌తో తన సంబంధాన్ని ధృవీకరించింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘మేము వివాహం చేసుకోబోతున్నామని.. తగిన సమయం చూసుకుని త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నామని ఆమె తెలిపారు.

ఇక గతంలో జ్వాల బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం కొద్దికాలానికి పరిమితం అయిందనుకోండి. ఇటు హీరో విష్ణు విశాల్‌ కూడా రజనీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కానీ వీళ్లు కూడా విడిపోయారు. మొత్తానికి ఇద్ద‌రూ త‌మ భాగ‌స్వామ్యుల‌ను వ‌దిలి.. ఒక్క‌ట‌య్యారు. మొత్తానికి గుత్తా జ్వాల, విష్ణు విశాల్‌ తో తానూ నడుపుతున్న రహస్య ఎఫైర్‌ ను బహిరంగం చేసేసింది,

సంబంధిత సమాచారం :

More